రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారి మహిళను కేంద్ర ప్రభుత్వం నియమించింది. జయావర్మ సిన్హా (Jaya Verma Sinha) రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
Railway Board: రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారి మహిళను కేంద్ర ప్రభుత్వం నియమించింది. జయావర్మ సిన్హా (Jaya Verma Sinha) రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు జయావర్మ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే బోర్డు సీఈవో (Railway Board CEO), ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన తొలి మహిళగా జయావర్మ సిన్హా రికార్డ్‌కెక్కారు.
ప్రస్తుతం ఉన్న రైల్వే బోర్డు సీఈధో అనిల్ కుమార్ లాహోటీ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈక్రమంలో కేంద్రం విజయావర్మను రైల్వే బోర్డు సీఈవోగా నియమించింది. ప్రస్తుతం రైల్వే బోర్డులో సభ్యురాలిగా ఉన్న జయావర్మ.. సెప్టెంబర్ 1 నుంచి 31 ఆగష్టు 2024 వరకు రైల్వే బోర్డు సీఈవోగా కొనసాగనున్నారు. ఇకపోతే జయవార్మ 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. నాలుగేళ్ల పాటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా పని చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించి అధికారిక సమాచారాన్ని వివరించడం ద్వారా జయావర్మ సిన్హా మీడియాలో నిలిచారు.