గుజరాత్, ముంబై ల మధ్య క్వాలిఫైయర్ రౌండ్ 2 మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ పెరిగిపోతుంది. కీలక మైన ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ లో తలపడబోతున్నారు..
IPL Key Match : ఇప్పటి దాకా ఐదు ఐపీఎల్ (IPL) టైటిల్స్ (Titels) గెలుచుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరో కీలక పోరుకు రెడీ అయింది. శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2 (Quealifier2)లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Taitans)తో తలపడేందుకు సిద్ధమైంది. బలాబలాల పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టిక (Points Table)లో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌కు సొంతగడ్డపై ఆడనుండటం సానుకూలాంశం కాగా సీజన్ చివరి దశకు వస్తున్నా కొద్ది ముంబైకి మ్యాచ్ విన్నర్లు ఎక్కువవుతున్నారు. లీగ్ దశ చివర్లో కామెరూన్ గ్రీన్ బ్యాట్‌తో విశ్వరూపం కనబరుస్తుంటే.. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్ రూపంలో ముంబైకి మరో హీరో దొరికాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డావిడ్, నేహల్ వధేరా రూపంలో ముంబై బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నది. గుజరాత్‌కు గిల్, సాహా, హార్దిక్, శంకర్, మిల్లర్, తెవాటియా, రషీద్‌ఖాన్ రూపంలో బలమైన సైన్యమే ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే.. ముంబై కంటే గుజరాత్ వైపే కాస్త మొగ్గు కనిపిస్తున్నది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న మహమ్మద్ షమీ, మోహిత్ శర్మతో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం టైటాన్స్‌కు అదనపు బలం చేకూర్చనుంది. కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫునే ఆల్‌రౌండర్‌గా సత్తాచాటి జాతీయ జట్టుకు ఎంపికైన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే రాటు దేలిన పాండ్యా.. అతడి వ్యూహాలను ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరం.