IPL 2022: టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ బిగ్ ఫైట్ జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బలంగా కన్పిస్తుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లక్నో జట్టు మూడింట్లో గెలుపొందగా.. ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు రాజస్థాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండిట్లో విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్‌లో పాల్గొనడం ఇదే మొదటి సారి ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆటగాళ్ళు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒడిన మ్యాచ్‌లో సైతం లక్నో ప్లేయర్స్ ప్రత్యర్థికి అంత తేలిగ్గా లొంగలేదు.