MAHARASTRA CRISIS: క్షణం క్షణం టెన్షన్ – ఏం జరుగుతోంది
Maharastra political number game. మహారాష్ట్రలో క్షణ క్షణం రాజకీయాలు మారిపోతున్నాయి. నెంబర్ గేమ్ తో అధికారం థాక్రే చేతిలో ఉంటుందా , పోతుందా అనే టెన్షన్ మొదలైంది. ఉద్దవ్ థాక్రే తో పాటుగా ఉన్న వారికి సైతం ప్రభుత్వం మనుగడ పైన రోజులు గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. బీజేపీతో కాదని రాజకీయంగా బద్ద శత్రువులైన ఎన్సీపీ – కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక తిరుగు లేదని భావించిన సీఎం థాక్రే, ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు. వారిని కట్టడి చేయటానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. వారి పైన అనర్హత వేటు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, పార్టీ జారీ చేసిన విప్ ఉల్లంఘన లేదా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లుగా ఆధారాలు ఉంటేనే నిర్ణయానికి అవకాశం ఉంటుంది.
సీఎం అధికారిక నివాసం వీడారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అసమ్మతి బావుటా ఎగరవేసి..రాష్ట్రం దాటి వెళ్తున్నా సీఎం ఉద్దవ్ థాక్రే కోటరీ..ఆయన ఇంటలిజెన్స్ గుర్తించ లేకపోయింది. దీంతో..భారీ నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 284 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు శివసేనలోనే థాక్రే వర్గం సంఖ్య 15కి పడిపోయింది. షిండే మద్దతు దారుల సంఖ్య 40కి చేరింది. ఎన్సీపీి 55, బీజేపీ 106, కాంగ్రెస్ 44, ఇతరులు 24 ఉన్నారు. విశ్వస పరీక్ష నిర్వహించటం ద్వారా రెబల్స్ పైన అనర్హత వేటు వేసి పదవిలో కొనసాగే సాంకేతిక అంశాల పైన ఇప్పుడు సీఎం థాక్రే శిబిరం ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా.. 12 మంది రెబెల్ ఎమ్మెల్యే లను డిస్ క్వాలిఫై చేయలని డిప్యూటీ స్పీకర్ నరహరి జెర్వాల్ శివసేన లేఖ రాసింది.
తాము నిర్వహించిన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరు కాలేదనే కారణంగా వారి పైన అనర్హత వేటు వేయాలని ఆ లేఖలో కోరింది. ఆ 12 మంది జాబితాలో షిండే పేరు సైతం ఉంది. దీని ద్వారా వారు ఎమ్మెల్యేలుగా లేకుండా చేయటం థాక్రే వ్యూహంగా కనిపిస్తోంది. కాగా, డిప్యూటీ స్పీకర్ నరహరి జెర్వాలే ఎన్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కర్ణాటక రాజకీయం తరహాలో ఇప్పుడు మహారాష్ట్రలో సీఎం థాక్రే విశ్వాస పరీక్ష నిరూపించుకోవాల్సి వస్తే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు స్పీకర్ గా ఉన్న నానా పటోల్ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియామకం కావడంతో డిప్యూటీ స్పీకర్ నరహరి జెర్వాలే కీలకంగా మారారు. ఒక వైపు థాక్రే రాజీనామా తాము కోరటం లేదని చెబుతూనే, ఆయన మీద విమర్శలు చేస్తున్నారు.
బీజేపీతో కలవాలని కండీషన్ పెడుతున్నారు. సీఎం థాక్రే అందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. రాజీనామాకు సైతం థాక్రే మానసికంగా సిద్దమైపోయినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశం నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటే..కథ క్లైమాక్స్ కు వచ్చే అవకాశం ఉంది. షిండే ను తమ వర్గ నేతగా రెబల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇదే సమయంలో గవర్నర్ సైతం కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్నారు. అటు కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ఇటు రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి థాక్రే సైతం కరోనా బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్లో దీనికి ముగింపు ఎలా ఉంటుందో.. ఏ రకమైన పరిణామాలు చోటు చేసకుంటయో అనే టెన్షన్ రాష్ట్రంలో నెలకొని ఉంది.