Ranadeep Guleria: కరోనా మాదిరిగానే ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాపిస్తుంది – రణదీప్ గులేరియా
Influenza virus H3N2 spreads like Covid, cautions Ex AIIMS Chief Guleria
కరోనా మాదిరిగానే ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాపిస్తుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. హెచ్ 3 ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కరోనా మాదిరిగానే వ్యాప్తించే అవకాశం ఉందనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఏడాది సంవత్సరం ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోందని ఇటువంటి సమయంలో అత్యంత జాగురుతతో ఉండాలని గులేరియా సూచించారు. కరోనా వలె ఇన్ ఫ్లూయెంజా వైరల్ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచనలు
దేశంలో అనేక రాష్ట్రాలలో కూడా ఫ్లూ కేసులు అధికం కావడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అప్రమత్తం అయింది. కొన్ని సూచనలు చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలని, వైద్యుల సూచనలు లేకండా ఎటువంటి మాత్రలూ వాడవద్దని స్పష్టం చేసింది. ఇటువంటి సమయంలో సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది.
ఫ్లూ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విరోచనాలు వంటి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఫ్లూ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇటువంటి సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Former #AIIMS-Delhi Director Dr #RandeepGuleria spoke on the rise in #influenza cases caused by the #H3N2virus and said it spreads through droplets and mutates every year around this time. pic.twitter.com/MFZ9DiXDyz
— Mahar Naaz (@naaz_mahar) March 7, 2023