INDIGO Flight: విమానంలో ప్రయాణికుడి హల్ చల్..బ్యాగ్ లో బాంబ్ ఉందంటూ…
INDIGO Flight Bomb threat:విమానంలో ఓ ప్రయాణికిడు చేసిన పని ప్రయాణికులతో పాటు పోలీసులను, విమాన సిబ్బందిని హడలగొట్టింది. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా తనిఖీలు చేశారు. బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు విమాన సిబ్బంది.
ఆపై పోలీసులు బాంబు-డాగ్ స్క్వాడ్ సాయంతో అతని బ్యాగ్‌ను చెక్ చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం విమానం మొత్తం తనిఖీలు చేపట్టి ఏం లేదని నిర్ధారించారు. తనిఖీల అనంతరం విమానాన్ని ప్రయాణానికి అనుమతించారు. విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడు రిషి చంద్ సింగ్‌గా గుర్తించారు. ఈ మధ్యకాలంలో ఇండిగో విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. గత నాలుగు రోజుల క్రితం అరబ్ దేశాల నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ ఆ విమానాన్ని కరాచీ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.