H3N2 virus: కొత్త వైరస్.. కర్నాటకలో వ్యక్తి మృతి!
H3N2 virus: కరోనా తర్వాత ఇప్పుడు H3N2 వైరస్ (ఇన్‌ఫ్లుఎంజా వైరస్) వ్యాప్తి చెందడం ప్రారంభించింది. అందుతున్న సమాచారం ప్రకారం, కర్ణాటక, పంజాబ్ మరియు హర్యానాలో H3N2 వైరస్ కారణంగా మరణం నిర్ధారించబడింది. అయితే ప్రాథమిక విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, H3N2 నుంచి మరణానికి కారణాలు గుర్తించడానికి తదుపరి పరిశోధన అవసరం అని అంటున్నారు. మరోవైపు, కర్ణాటకలోని హాసన్‌లో హెచ్3ఎన్2 వైరస్‌తో ఒకరు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన రోగిని హెచ్ గౌడగా గుర్తించారు. ఆయనకు 82 ఏళ్లు. ఫిబ్రవరి 24న ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇక ఆయన మార్చి 1 న మరణించాడు. అనంతరం వారి నమూనాలను పరీక్షలకు పంపారు. మార్చి 6న IA నివేదికలో H3N2 నిర్ధారించబడింది.
దేశవ్యాప్తంగా H3N2 ఆందోళన
H3N2 ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి దేశవ్యాప్తంగా ఆందోళనను పెంచింది. మూడేళ్ల తర్వాత కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకున్న తరుణంలో ఇన్‌ఫ్లుఎంజా కేసులు తెరపైకి వస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. వైద్యుల ప్రకారం, ఇన్ఫ్లుఎంజా రోగులలో చాలా మందికి దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్, శరీర నొప్పి, ముక్కులో నీరు కారడం లాంటి లక్షణాలు ఉంటాయి.