ఉత్కంఠభరిత పోరులో భారత్ ఓటమి
ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో భారత్ పోరు ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. టోర్నమెంట్‌లో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
275 పరుగుల లక్ష్య చేధనకు దిగిన సఫారీ బ్యాటర్లను భౌరత బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా సౌతాఫ్రికా విజయాన్ని ఆపలేక పోయారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు లారా వొల్వార్ట్ 80, లారా గూడల్ 49, మిగ్నాన్ దు ప్రీజ్ 51పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు హర్మాన్‌ప్రీత్, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు తీశారు.