Mangoes: మామిడి పండ్లు (Mangoes) అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వీటి కోసం సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చేస్తుంటారు. ఏప్రిల్ (April) నుంచే మామిడి పండ్ల సీజన్ మొదలైపోతుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మామిడి పండ్ల హవా కొనసాగుతోంది. ఎంతో రుచికరమైన పండ్లను తినేందుకు జనాలు ఎగబడుతుంటారు. మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లు, చిరు వ్యాపారుల వద్ద బారులు తీరుతుంటారు.
Mangoes: మామిడి పండ్లు (Mangoes) అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వీటి కోసం సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఏప్రిల్ (April) నుంచే మామిడి పండ్ల సీజన్ మొదలైపోతుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మామిడి పండ్ల హవా కొనసాగుతోంది. ఎంతో రుచికరమైన పండ్లను తినేందుకు జనాలు ఎగబడుతుంటారు. మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లు, చిరు వ్యాపారుల వద్ద బారులు తీరుతుంటారు. ఇక ఆన్లైన్లో కూడా అన్ని రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆఫీస్, బిజీ లైఫ్లో మార్కెట్లకు వెళ్లి కొనుగోలు చేయలేని వారు ఆన్లైన్లో (Online) ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ఇలా ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా రూ. 25 కోట్ల విలువ చేసే మామిడి పండ్లను ఆర్డర్ చేశారు.
ప్రముఖ గ్రోసరీ డెలివరీ సంస్థ జెప్టోలో (Zepto) ఏప్రిల్ నెలలో ఎక్కువగా మామిడి పండ్లను కస్టమర్లు ఆర్డర్ (Order) పెట్టారు. ఇటీవల మామిడి పండ్ల కొనుగోలుకు సంబంధించి గణాంకాలను జెప్టో విడుదల చేసింది. అందులో ఏప్రిల్ నెలకు సంబంధించి కస్టమర్లు రూ. 25 కోట్లు విలువ చేసే మామిడి పండ్లను కొనుగోలు చేసినట్లు జెప్టో పేర్కొంది. సగటున రోజుకు రూ. 60 లక్షలు విలువ చూసే మామిడి పండ్లను కొనుగోలు చేశారని వివరించింది. అందులో ఎక్కువగా మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో పండే ఆల్ఫాన్సో రాకానికే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత బంగినపల్లి మామిపండ్లను ఎక్కువగా కొనుగోలు చేశారని చెప్పింది. ఏప్రిల్లో మొత్తం మామిడి పండ్ల విక్రయాల్లో ఆల్ఫాన్సో 30 శాతం ఉండగా.. బంగినపల్లి 20శాతం అని జెప్టో వెల్లడించింది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి ఎక్కువగా ఆల్ఫాన్సో మామిడి పండ్ల ఆర్డర్లు వచ్చాయని జెప్టో తెలిపింది. దేశవ్యాప్తంగా వెయ్యి మంది రైతుల నుంచి మామిడి పండ్లను సేకరించి కస్టమర్లకు అందజేశామని తెలిపింది. ఆల్ఫాన్సో మామిడి పండ్లను స్పెషల్గా రత్నగిరి ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు వివరించింది. ఇక మే నెలలో ఇంతకు మించిన ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నట్లు జెప్టో పేర్కొంది.