Afghanistan : అఫ్గానిస్థాన్‌కు చేరిన భారత వైద్య పరికాలు
India’s assistance to Afghanistan: తాలిబన్లు రాజ్యమేలుతున్న అఫ్గానిస్థాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న భారీ భూకంపం వల్ల వేయికి పైగా మరణించగా.. 1500 మందికిపైగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులకు వైద్య సదుపాయం లేక ఆ దేశంలో క్షతగాత్రులు బ్రతికుండగానే నరకాన్ని చూస్తున్నారు. దీంతో వారికి వైద్య సదుపాయాలు కల్పించేందుకు బారత్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా వైద్య పరికరాలతో గురువారం రాత్రి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో కాబుల్‌కు వైద్య పరికరాలను పంపింది. దీంతో తాలిబన్ల రాజ్యంగా మారిన తర్వాత అఫ్గాన్‌కు మొదటి సారి సహాయం అందజేసిన దేశంగా భారత్ నిలిచింది.
మరోవైపు అఫ్గాన్‌కు భారత్ ఈ సహాయం అందించడంతో అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా దౌత్య కార్యాలయం తేరుకున్నట్లైంది. భారత దౌత్య బృంద భద్రతకు తాలిబన్లు పలు మార్లు హామీలు ఇచ్చాక ఈ టెక్నికల్ టీమ్ అఫ్గానిస్థాన్‌కు వెళ్లింది. ఆదేశంలో వైద్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. 500 మంది క్షతగాత్రులకు కేవలం 5 పడకలు మాత్రమే ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో. వైద్యం కోసం చాలా మంది ఇతర దేశాలు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి.