Mohammed Shami: మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు షాక్ ..భరణం ఇవ్వాల్సిందే
Mohammed Shami: భారత బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టులో చుక్కెదురైంది. తన మాజీ భార్య హసీన్ జహాన్‌కు భరణం కింద ప్రతి నెల రూ. 50 వేలు కుమార్తెకు 80 ,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షమీ భార్య హసిన్ జహన్ నాలుగేళ్ల కిందట అతడిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడు తనను వేధిస్తున్నాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోల్‌కతా కోర్టులో గృహహింస, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసింది. షమీ నుంచి విడిపోవాలనుకుంటున్నానని, తనకు నెలవారీ భరణం ఇప్పించాల్సిందిగా వ్యాజ్యంలో పేర్కొంది. ఈ వ్యవహారంలో అలీపూర్ జిల్లా కోర్టు షమీ భార్య హసిన్ జహాన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ భరణం కింద రూ.50,000లను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగా.. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె పోషణకు రూ.80 వేలు ఖర్చు చేయాలని ఆదేశించింది.
2018 ఆగస్టు లో షమీ వేధిస్తున్నాడంటూ అతని భార్య హసిన్ జహాన్ భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై కేసు నమోదైంది. అదే సమయంలో తన కుమార్తె ఖర్చులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని ఫిర్యాదులో ఆరోపించింది. తన కుమార్తె పోషణకు గానూ నెలకు రూ.10 లక్షలు అందించేలా చూడాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై తీర్పునిచ్చిన కోర్టు.. హసిన్ జహాన్ డిమాండ్‌ను తిరస్కరించింది. తాజాగా కోర్టు తీర్పునిస్తూ అతని వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతినెలా భరణం చెల్లించాలని ఆదేశించింది. నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని షమీని కోర్ట్ ఆదేశించింది.