రానున్న రోజుల్లో ప్రపంచంలోనే భారత్(India) మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని.. దీనికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలవబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు.
Modi: రానున్న రోజుల్లో ప్రపంచంలోనే భారత్(India) మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని.. దీనికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలవబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. పార్లమెంట్ కొత్త భవనంలో రాజ్య సభ మంగళవారం కొలుదీరింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ఈ రోజు భారత దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
పార్లమెంట్‌పై భారత ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ప్రధాని చెప్పుకొచ్చారు. పాత పార్లమెంట్ భవనంలో తాము ఎన్నో విప్లవాత్మకమైన బిల్లులు తీసుకొచ్చామన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని చెప్పారు.
మేకిన్ ఇండియా (Makein India) దేశంలో గేమ్ ఛేంజర్‌గా మారిందని ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. 2047లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలోనే స్వాతంత్ర శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించుకుంటామన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని.. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకంగా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను కూడా రద్దు చేశామని గుర్తు చేశారు.