Heat waves in Summer: వేసవిలో భానుడి ప్రతాపం… 122 ఏళ్ల తరువాత
Heat waves in Summer: వేసవికాలం రాబోతున్నది. ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ లేనంతగా ఎండలు పెరిగిపోయాయని, 122 ఏళ్ల తరువాత ఫిబ్రవరి నెలలో వేడి వాతావరణం ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కన్నారు. దీని ప్రకారం వేసవి వచ్చేసరికి ఎండలు భారీగా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది సమ్మర్‌లో వేడిగాలులు అధికంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. మార్చి నుండే ఎండలు, వడగాలులు వీచే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
మార్చి నుండి ఎండలు పెరిగినా, ఏప్రిల్ నెలలో వేడి పెరుగుతుందని, దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నుండే వేడి పెరిగిపొవడానికి ఇదొక కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల నుండి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వేసవిలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలుతీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.