కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే పలు నిర్ణయాలను ప్రకటించింది. దేశంలోని రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఉపశమనం కల్పించేలా శుభవార్త అందించింది.
Ration Card : కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే పలు నిర్ణయాలను ప్రకటించింది. దేశంలోని రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఉపశమనం కల్పించేలా శుభవార్త అందించింది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే అనుసంధానం చేసుకోవాలని కేంద్రం సూచించింది.. లేదంటే గడువు తర్వాత రేషన్ కార్డు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.
రేషన్ కార్, ఆధార్ లింక్ చేయకపోతే కార్డును ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఇంతకు ముందు దీని చివరి తేదీ మార్చి 31, 2023 వరకు నిర్ణయిం చింది. ఇది ఇప్పుడు జూన్ 30, 2023 వరకు పొడిగించారు. గడువు తేదీ రేషన్ కార్డ్, ఆధార్ లింక్ చేయకపోతే రేషన్ కార్డ్ దానంతట అదే రద్దు అవుతుందని కేంద్రం వెల్లడించింది. జులై 1 నుంచి రేషన్‌లో లభించే గోధుమ, బియ్యం ఇకపై లభించవు. రేషన్ కార్డ్ రద్దుతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ కాకుండా, రేషన్ కార్డును గుర్తింపు, చిరునామా రుజువుగా పయోగించవచ్చు. రేషన్ కార్డ్‌తో ఆధార్‌ని లింక్ చేయడం ద్వారా, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్‌లను పొందకుండా ప్రభుత్వం నిరోధించగలదని పేర్కొంది.
రేషన్ కార్డుకు ఆధార్ లింక్ వల్ల అధిక ఆదాయం పొందేవాళ్ళు ఈ కార్డుల్లో తేలిపోనుంది వారిని అనర్హులుగా గుర్తించవచ్చు. ఇది అర్హులైన వ్యక్తులు మాత్రమే సబ్సిడీ గ్యాస్ లేదా రేషన్ పొందేలా చూస్తుంది. డూప్లికేట్ రేషన్ కార్డులు, మధ్య దళారుల యథేచ్ఛను తగ్గించడంలోనూ ఈ రెండింటినీ అనుసంధానం చేయడం సాయపడుతుంది. జూన్ 30, 2023లోపు రేషన్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి అని పేర్కొంది.