Rahul Gandhi: నేనుపెళ్లి కి వ్యతిరేకం కాదు.. రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లికి వ్యతిరేకం కాదని, నాకు సరియైన అమ్మాయి దొరికితే పెళ్లిచేసుకోవటానికి సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు. జర్నలిస్ట్ కమియా జాని అడిగిన ప్రశ్నలకు రాహుల్ బదులిచ్చారు. 52 ఏళ్ల రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోని విషయం తెలిసిందే. రాహుల్ ఎక్కడికి వెళ్లినా .. ఆయన్ను పెళ్లి ప్రశ్నలే వేస్తున్నారు. అయితే తాజాగా రాహుల్ తన పెళ్లి గురించి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. రాహుల్ సమాధానం ఇచ్చారు. ఎవరైనా సరైన అమ్మాయి దొరికితే అప్పుడు తప్పకుండ పెళ్లి చేసుకుంటానని అన్నారు. దానికి ఏమైనా చెక్‌లిస్టు ఉందా అని మరో ప్రశ్న వేసింది. అదేమీ లేదు ప్రేమించే వ్యక్తి బెటర్ అని ఆమె ఇంటలిజెంట్ అయితే చాలు అన్నట్లు రాహుల్ తెలిపారు. మీ మెసేజ్ అమ్మాయిలకు చేరుతుందని ఆమె పేర్కొంది. రాహుల్ దానికి సమాధానంగా నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారని రాహుల్ నవ్వుతూ కామెంట్ చేశారు. తాను పెళ్లాడబోయే వ్యక్తి తన తల్లి లాంటి గుణాలు కలిగి ఉండాలని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పేర్కొన్న విషయం తెలిసిందే.