Union Minister Smriti Irani: 18 ఏళ్ల యువతి బార్ ఎలా నడుపుతుంది: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
Smriti Irani Fires on Congress: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన కూతురిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. 18 ఏళ్ల యువతిపై, ఒక కళాశాల విద్యార్థినిపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో చట్ట విరుద్దంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం ఆ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ నేతలు తన కూతురిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు చట్ట విరుద్ధంగా బార్ నడుపుతోందన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబంపై బుదర జల్లుతున్నారని విమర్శించారు.
గోవా ఎక్సైజ్ శాఖ షోకాజ్ నోటీసును చూపించిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్ పార్టీ తన కూతురి వ్యక్తిత్వాన్ని బహిరంగంగా కించపరుస్తోందని, ఆ షోకాజ్ నోటీసులో అసలు తన కూతురి పేరు ఎక్కడుందని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. RTI అప్లికేషన్‌లోని వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఆ ఆర్టీఐ అప్లికేషన్లో తన కూతురి పేరు ఎక్కడుందో చెప్పాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌ను స్మృతి ఇరానీ నిలదీశారు. తన కూతురుపై వచ్చిన ఈ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా చేసినవేనని, ఆమె వ్యక్తిత్వాన్ని చంపేయడమే కాకుండా.. తనను రాజకీయంగా దెబ్బతీయడం కూడా అన్నారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ అధినాయకత్వంగా చెప్పుకునే గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే జరిగిందని ఆమె ఆరోపించారు.
#WATCH | Union Minister Smriti Irani denies the allegations of her 18 year old daughter running an illegal bar in Goa pic.twitter.com/iIxag5e4fQ
— ANI (@ANI) July 23, 2022