Cow Cess: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..మందు బాబుల నుంచి గో రక్షణ నిధుల సేకరణ
Himachal Pradesh introduces Cow Cess of Rs.10 on every liquor bottle
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల రక్షణకు ప్రతి ఏటా రూ.100 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది. గో రక్షణకు కేటాయించాల్సిన ఈ వంద కోట్ల రూపాయలను మందు బాబుల నుంచి రాబట్టాలని నిర్ణయించింది. ప్రతి మందు బ్యాటిల్ పైనా అదనంగా 10 రూపాయలు వసూలు చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఈ విషయం వెల్లడించారు.
గోరక్షణకు 10 రూపాయల సెస్ విధింపుపై విమర్శలు గుప్పుమంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. గోరక్షకు డబ్బులు సేకరించడం కన్నా కోతుల, కుక్కల బెడద తీర్చేందుకు సెస్ వసూలు చేస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలో వీధి కుక్కలు, కోతుల బెదడ ఎక్కువుగా ఉందని ప్రభుత్వానికి తమ ట్వీట్ల ద్వారా గుర్తుచేస్తున్నారు.
Quest for proving our holiness! Quoting Gita, FM HImachal slapped RS 10 cow cess on each bottle alcohol. Instead RS 5 monkey & stray dogs cess wd help more. Have monkeys/ dogs disappeared from Shimla & HP? More lives would have been saved @SukhuSukhvinder
— Yashovardhan Jha Azad (@yashoazad) March 18, 2023
#news ―Himachal Pradesh announces ₹10 'Cow cess' bought per liquor bottle in their new budget. pic.twitter.com/GERavWrEf1
— Balanced Report (@reportbalanced) March 17, 2023