Cow Cess on Liquor: మద్యంపై కౌ సెస్ .. బాటిల్‌పై రూ. 10 వసూలు
Cow Cess on Liquor: దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం లభించే శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటి. మద్యం ద్వారా అనేక రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. మద్యంపై ట్యాక్సులు, ధరలు పెంచినా మందుబాబులో మద్యాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. మందుబాబుల వీక్నెస్‌ను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల ట్యాక్సులు వసూలు చేస్తుంటాయి. అయినప్పటికీ పెద్ద మొత్తంలో రాష్ట్రాలకు ఆదాయం వస్తూనే ఉంటుంది. తాజాగా, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై కొత్తరకం సెస్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది.
మద్యం విక్రయాలపై కౌసెస్‌ను విధించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. ఈ సెస్ ను అమలు చేయడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆదాయం సమకూరుతుందని సీఎం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. అంతేకాకుండా రవాణా వ్యవస్థలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్లు సీఎం తెలియజేశారు. ఇప్పటి వరకు ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో రూ. 1000 కోట్ల రూపాయల వ్యయంతో 1500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సుఖ్విందర్ సింగ్ తెలియజేశారు. పర్యావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు.