దేశరాజధాని ఢిల్లీలో (Delhi) జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్రం ఢిల్లీలో హై అలర్ట్ (High Alert) ప్రకటించింది.
Delhi: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్రం ఢిల్లీలో హై అలర్ట్ (High Alert) ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు, పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) ఆధారిత సీసీ కెమెరాలను సమావేశాలు జరిగే వేదికల వద్ద అమర్చారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా.. గొడలు ఎక్కడం, పరుగెత్తడం వంటివి చేసినా ఏఐ కెమెరాలు పసిగట్టి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. అలాగే అనుమానాస్పద డ్రోన్లను కూల్చివేసేందుకు ఎన్ఎస్‌జీ.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంది. అటు ఎత్తైన భవనాల వద్ద ఆర్మీ స్పైపర్లను మోహరించనున్నారు. మరోవైపు అమెరికా నుంచి సీఐఏ, యూకే నుంచి ఎంఐ-6 లతో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్ధల బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.