హీరో కరీజ్మా.. ఒకప్పుడు ఓ ఊపు ఊపింది ఈ బైక్ (Bike). ఆటోమొబైల్ రంగంలో (Automobile Industry) కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ బండంటే బైక్ లవర్స్ పడి చచ్చిపోయేవారు.
Hero Karizma: హీరో కరీజ్మా.. ఒకప్పుడు ఓ ఊపు ఊపింది ఈ బైక్ (Bike). ఆటోమొబైల్ రంగంలో (Automobile Industry) కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ బండంటే బైక్ లవర్స్ పడి చచ్చిపోయేవారు. కొద్దిరోజులుగా మార్కెట్లో ఈ బైక్ కనిపించకపోయినప్పటికీ.. దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఈ బైక్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ (Karizma XMR) పేరుతో మార్కెట్లోకి లాంఛ్ చేసింది.
అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ ధర రూ. 1.72 లక్షలుగా ఉంది. 210 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ మేటెడ్, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను తీసుకొచ్చింది. దేశీయ విపణిలో ప్రీమియం బైక్‌ల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు.. ఈ బైక్‌ను తీసుకొచ్చినట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం బైకుల విభాగంలో ఉనికిని పెంచుకునేందుకు వచ్చే ఏడాది నుంచి ప్రతి త్రైమాసికంలో ఒక కొత్త ఉత్పత్తిని తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీమియం బైకుల విభాగంలో హీరోకు 4 నుంచి 5 శాతం వాటా ఉందని నిరంజన్ గుప్తా వెల్లడించారు.
ప్రీమియం బైక్‌ల విభాగంలో గెలుపొందేందుకు కొత్త ఉత్పత్తులతో పాటు 360 డిగ్రీల విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 8 త్రైమాసికాల్లో 500 ప్రీమియమ్ బైక్ షోరూమ్‌లను దేశవ్యాప్తంగా ఓపెన్ చేస్తామని వెల్లడించారు.