Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ… భారీ వర్షంలోనూ స్వాముల యాత్ర
Sabarimala: శబరిమల భక్తులతో కిటకిటలాడుతుననది. ఆదివారం ఒక్కరోజే లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మాండస్ కారణంగా కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వర్షంలోనూ స్వాములు పాదయాత్ర చేస్తున్నారు. అయితే, వర్షం భారీగా మారడంతో ఎక్కడి భక్తులు అక్కడే ఆగిపోయారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టారు. పంపానది నుంచి సన్నిధానం వరకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో భక్తులు నిలిచిపోయిరు. అయితే, క్యూలైన్ల వద్ద రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీగా రద్దీ పెరగడంతో కేరళ హైకోర్టు ఆదివారం రోజున అత్యవరస విచారణజరిపింది. రద్దీ పెరిగితే ఏం చేస్తున్నారని, మరో గంట దర్శన సమయం పొడిగించాలని ఆదేశించింది. దేవస్థానం బోర్డు, ఆలయ ప్రధాన అర్చకుడు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మరో గంటపాటు దర్శనం సమయాన్ని పెంచాలని నిర్ణయించారు.