భారీగా డ్రగ్స్ పట్టివేత
చత్తీస్‌గడ్‌లోని అమృత్‌సర్‌లో భారీగా డ్రగ్స్ పట్టున్నారు అధికారులు. అట్టారి చెక్ పోస్ట్ వద్ద తనికీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు.. అమృత్‌సర్ నుంచి డ్రగ్స్‌తో ఢిల్లీకి వెళ్తున్న కంటైనర్‌ను పట్టుకున్నారు. కంటైనర్‌లో 700 కోట్ల విలువ గల 102 కేజీల హెరాయిన్ ఉన్నట్లు తెలిపిన అధికారులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్లు కంటైనర్లలో ఎవరికీ అనుమానం రాకుండా వెదురు దుంగల్లో హెరాయిన్‌ను ఉంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు స్మగ్లర్లు డ్రగ్స్‌ను ఢిల్లీలో ఎక్కడికి తరలిస్తున్నారు. అక్కడ ప్రజా ప్రతినిధులు ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారా.. లేక అడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు వీటిని అఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చినట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అక్కడి నుంచి భారత్ ఎలా తీసుకొచ్చారనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.