National Emblem Controversy : జాతీయ చిహ్నంపై అభ్యంతరం…మోడీపై విమర్శల వెల్లువ
National Emblem Controversy : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశ నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పాల్గొన్నారు. అయితే ఆ చిహ్నాన్ని మార్చారు అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. సారనాథ్‌లోని అశోక స్తంభంపై ఉన్న సింహాలు, ఈ సింహాల రూపంలో చాలా తేడా ఉందని, అవి రౌద్రంగా, గర్జిస్తున్నట్టుగా కన్పిస్తున్నాయని, ఇలా చేయడం భారత జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన పార్లమెంటు భవనాన్ని భారతదేశ కొత్త పార్లమెంటుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మార్చిందని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
అయితే విపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాన్ని కేవలం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కుట్ర అంటూ భారతీయ జనతా పార్టీ కొట్టిపారేసింది. అదే సమయంలో విపక్షాలు కూడా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రతిపక్ష నాయకులను వేడుకకు ఆహ్వానించకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మోడీని టార్గెట్ చేస్తున్నాయి.
9,500 కిలోల ఈ జాతీయ కాంస్య చిహ్నాన్ని రూపొందించిన డిజైనర్లు సునీల్ డియోర్, రోమియెల్ మౌస్ మీడియాతో మాట్లాడుతూ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పారు. సునీల్ దేవ్‌నే మాట్లాడుతూ “మేము వివరాలపై చాలా శ్రద్ధ తీసుకున్నాము. సింహం పాత్ర కూడా అంతే. చాలా చిన్న తేడాలు ఉండవచ్చు” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి జాతీయ చిహ్నం ఆవిష్కరణతో మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.