Google Maps for Chardham Yatra: గుడ్ న్యూస్… చార్‌ధామ్ యాత్రికుల కోసం గూగుల్ మ్యాప్స్
Google Maps for Chardham Yatra: ప్రతి ఏడాది సమ్మర్ లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర అత్యంత సాహసంతో కూడుకొని ఉంటుంది. పర్వత ప్రాంతాలు, మంచు ప్రాంతాల గుండా ఈ యాత్ర కొనసాగాలి. ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయో, ఎప్పుడు హఠాత్తుగా వరదలు సంభవిస్తాయో చెప్పడం చాలా కష్టం. చాలా ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మత్తులు కొనసాగుతుంటాయి. ఆ సమయంలో రోడ్లు బ్లాక్ చేస్తూ దారి మళ్లిస్తుంటారు. తెలియకుండా ఆ మార్గంలో వెళ్లే అక్కడి నుండి బయటకు రావడం చాలా కష్ట అవుతుంది. దీనిని బేస్ చేసుకొని ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది.
యాత్రికులు ప్రయాణించే మార్గంలో మూసేసిన దారులను మారాల్సిన మార్గాలను సూచిస్తూ గూగుల్ మ్యాప్స్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో అధికారులు దారులను మూసేసి కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే, గతంలో ఇలా మ్యాపింగ్ లేకపోవడంచేత యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కాగా, ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో యాత్రికులు ఇబ్బందులు లేకుండా యాత్రను కొనసాగించే అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.