బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడి కోహినూర్ వజ్రం ఇప్పిస్తారా..
IPL 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహినూర్ వజ్రం టాపిక్ వచ్చింది. బ్రేక్ సమయంలో బ్రాడ్ కాస్టర్ కెమెరాను ముంబై బీచ్.. మెరెన్ డ్రైవ్‌ను చూపించాడు. మూడు కిలో మీటర్ల పొడవు ఉండే ఈ బీచ్ లైట్ కాంతుల నడుమ మెరుస్తూ ఉంది. దీన్ని చూసిన మ్యాచ్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కోహినూర్ వజ్రం గురించి చర్చించారు. భారత్ కోహినూర్ వజ్రంకోసం ఇంకా ఎదురు చూస్తుందని బ్రిటన్‌కు చెందిన సహచర కామంటేటర్ అలెన్ విల్కిన్స్‌ని ఉద్దేశించి మాట్లాడారు. అంతే కాకుండా బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ వజ్రం భారత్‌కు వచ్చేలా చూస్తావా అని సరదాగా అడిగాడు. దీంతో అలెన్ విల్కిన్స్ ముసిముసి నవ్వులు చిందించాడు.
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాట్స్‌మెన్స్ బాల్ బౌండరీకి తరలించిన విధానం, అదే బౌలర్ అయితే బ్యాట్స్‌మెన్స్‌ను ఔట్ చేసిన విధానాన్ని వివరిస్తూ ఉంటారు కామెంటేటర్‌లు. కెమెరా ఎవరి వైపు ఉంటే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ నవ్వులు పూయిస్తుంటారు.