Jeet Adani : గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు
Jeet Adani : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీకి,దివా జైమిన్ షా తో అహ్మదాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. దివా గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం.
జీత్-దివాల నిశ్చితార్థ వేడుకకు చాలా తక్కువ మంది హాజరయ్యారు. కాగా, ఈ ఎంగేజ్‌మెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మార్చి 12న ఆదివారం నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తోంది. అయితే నిశ్చాతార్థినికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటో లో కాబోయే దంపతులిద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించారు. జీత్ అదానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి తన చదువును పూర్తి చేశారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరగా.. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.