Ganga Vilas: గంగా విలాస్ సురక్షితంగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు
Ganga Vilas Cruise not stuck in Bihar, clarifies IWAI
కేంద్ర పర్యాటక శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గంగా విలాస్ నదీ పర్యాటక నౌక బీహార్ లో ఆగిపోయిందనే వార్తలను IWAI ఖండించింది. ఎటువంటి ఇబ్బందులు లేవని IWAI చైర్మన్ ట్వీట్ చేశారు. గంగా విలాస్ నౌక పాట్నా వద్ద ఆగిపోయిందని పలు వార్తా సంస్థలు చెబుతున్నదాంట్లో నిజం లేదని IWAI చైర్మన్ బంధోపాధ్యాయ స్పష్టం చేశారు.
చిన్న సాంకేతిక కారణంగా నదీ తీరానికి చేరుకోలేకపోయిందని, అంతకు మించి ఏమీ లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నివారణ బలగాలు అక్కడకు చేరుకున్నాయని బీహార్ లోని చాప్రా నదీ పర్యాటక శాఖ అధికారి సత్యేంద్ర సింగ్ తెలిపారు.కొందరు స్థానిక జర్నలిస్టులు ఏదో జరిగిపోయినట్లు వార్తలు రాశారని, వాటిలో నిజం లేదని స్పష్టం చేశారు.
గంగా విలాస్ పేరుతో రివర్ క్రూయిజ్ యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 51 రోజుల పాటు 50 పర్యాటక ప్రాంతాలను ఈ యాత్ర ద్వారా చూసేందుకు టూరిస్టులకు అవకాశం కలగనుంది. రివర్ క్రయూజ్ యాత్రలో హెరిటేజ్ సైట్లు, జాతీయ పార్కులు, రివర్ ఘాట్లు దర్శనమివ్వనున్నాయి. వాటితో పాటు పాట్నా నగరం, జార్ఖండ్ లో సాహిబ్ గంజ్, కోల్ కతా నగరం, గౌహతి నగరం తదితర 50 ప్రదేశాల గుండా ప్రయాణం సాగనుంది.
జనవరి 13న ప్రారంభమైన క్రూయిజ్ యాత్ర మార్చి 1 వరకు కొనసాగనుంది. మొత్తం 80 మంది టూరిస్టులకు ఇందులో ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. విలాసవంతమైన 18 సూట్లు పర్యాటకులకు మరుపురాని అనుభూతులను అందించనుంది. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ టూర్ ద్వారా తెలుసుకునే అవకాశం కలగనుందని ప్రపంచ పర్యాటకులకు ప్రధాని మోడీ తెలిపారు.
“The Ganga Villas reached Patna as per schedule. There is absolutely no truth in the news that the vessel is stuck in Chhapra. The vessel will continue its onwards journey as per schedule” : Sanjay Bandopadhyaya, Chairman, IWAI
— IWAI (@IWAI_ShipMin) January 16, 2023
📌 Voyage of Cruise Vessel MV #GangaVilas
❌ There is no truth in the news that the vessel is stuck at Chhapra; the anchoring place & transport mode of tourists to the bank is decided by the cruise operator depending on the safety of its passengers
🔗 https://t.co/5YZVwvgZlU pic.twitter.com/jhMo2X5kH1
— PIB In Meghalaya (@PIBShillong) January 16, 2023