G 20 Tourism Working group meeting started in Srinagar
జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభం అయింది. భూలోక స్వర్గంగా పేరుగాంచిన జమ్ము కశ్మీర్ గురించి సదస్సులో పాల్గొన్న వక్తలు వివరించారు. జీ 20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రతినిధులు ఇక్కడి విశేషాలను తెలుసుకుని ఆశ్చర్యానికి గురౌతున్నారు. సదస్సుకు హాజరైన డిలిగేట్లను కేంద్ర టూరిజం శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు.
ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్ముకశ్మీర్ గొప్పతనాన్ని వివరించారు. 1990 కు ముందు జమ్ము కశ్మీర్లో ఎన్నో సినిమాలు షూటింగులు జరుపుకున్నాయని, 1990 తర్వాత ఒక్కసారిగా ఇక్కడి వాతావరణం మారిపోయిందని ఆనాటి సంగతులను వివరించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని, సినిమా షూటింగులు చేసుకోడానికి అనుకూలంగా ఉన్నాయని మంత్రి వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి, కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఇక్కడి పరిస్థితులు చాలా వరకు మారాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.
జీ 20 టూరిజం సదస్సు కశ్మీర్లో జరగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు సమకూరనున్నాయని అమితాబ్ కాంత్ (జీ 20 షెర్పా) ఆశాభావం వ్యక్తం చేశారు. జీ 20 సదస్సు ఇక్కడ జరగడం ద్వారా ఇక్కడ షూటింగులు జరుపుకోడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు సినీ రంగానికి చెందిన వారికి అందుతుందని సదస్సుకు హాజరైన టూరిజం పరిశ్రమకు చెందిన వారు అభిప్రాయపడుతున్నారు.
శ్రీనగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సులో పాల్గొనేందుకు హీరో రాంచరణ్ అక్కడకు చేరుకున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు సాంగ్కు వేదికపై ఒక విదేశీ ప్రతినిధితో కలిసి డాన్స్ వేసే అక్కడి వారిని అలరించారు.
Global Star Ram Charan lands in Srinagar as he represents the Indian Film Industry at the esteemed G20 summit!@alwaysramcharan #GlobalStarRamCharan #RamCharan #RCG20 #GameChangerRamCharan pic.twitter.com/56xxgyCQtT
— Ramesh Bala (@rameshlaus) May 22, 2023
Superstar ram charan performs natu natu at G20 meeting srinagar, kashmir #ramchran #natunatu #G20_20_in_kashmir #G20 pic.twitter.com/felSp0sl4O
— Preeti Sompura (@sompura_preeti) May 22, 2023
On arrival in Srinagar for #G20 Tourism Working Group meeting with Tourism Minister @kishanreddybjp and Secretary I & B @apurvaIAS . Fabulous reception full of Kashmiri warmth . pic.twitter.com/7LlJKaBbGI
— Amitabh Kant (@amitabhk87) May 22, 2023
#BREAKING: #G20 Nations get a never seen before grand welcome at the Lalit Hotel in Srinagar, #Kashmir. G20 Tourism Sherpa Track visit officially begins as delegation lands in Srinagar. First such international event being held in Kashmir. pic.twitter.com/CsMrfCwoZN
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 22, 2023
CRPF Commandos, Marcos, and Black cat Commandos all geared up for the upcoming G20 summit in Srinagar pic.twitter.com/sMja7GHlX2
— The Asian News Hub (@AsianNewsHub) May 20, 2023
Captured the beauty of the Srinagar city while on my way from airport to the venue of the 3rd Tourism Working Group Meeting.
J&K is truly mesmerizing and is all set to host the #G20 delegates.@g20org pic.twitter.com/xpRtjgsIQP
— G Kishan Reddy (@kishanreddybjp) May 22, 2023