Encounter: జమ్మూ కశ్మీర్ ఎన్‌కౌంటర్ నలుగురు టెర్రరిస్టులు హతం
జమ్మూ కశ్మీర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భద్రతా దళాలు ఒక జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరణించిన జైషే ఉగ్రవాదిని మజీద్ నాజిర్‌గా అధికారులు గుర్తించారు. ఇటీవల ఫరూక్ మీర్ అనే పోలీస్ అధికారి ఇంటికి వెళ్లీ మరీ చంపిన సభ్యుల్లో ఇతనే సూత్రధారని భద్రతా దళాలు భావిస్తున్నాయి.
మరోవైపు గత మూడు రోజులుగా నిత్యం కశ్మీర్ లోయలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతాల్లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో భారత భద్రతా దళాలు 11 మంది ఉగ్రవాదులను హతమార్చారు. గతంలో ఉగ్రవాదులు హిందీ పండిత్‌లపై దాడికి దిగారు. కన్పించిన పండిట్‌ను కాల్చి చంపేవారు. దీంతో గతంలో పండిట్‌లు వలసలు వెళ్లారు. అనంతరం పోలీసులను టార్గెట్ చేశారు టెర్రరిస్టులు.