కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జనలు పడుతోంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలలో ఎవరిని సీఎం చేయాలనివిషయంలో సమాలోచనలు చేస్తోంది. హుటాహుటిన ఢిల్లీ రమ్మని సిద్ధరామయ్యకు పిలుపు రావడంతో ఆయన హస్తిన చేరుకున్నారు. పలువురు సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
Former CM Siddda ramayya reached Delhi, to meet AICC Observers
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జనలు పడుతోంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలలో ఎవరిని సీఎం చేయాలనివిషయంలో సమాలోచనలు చేస్తోంది. హుటాహుటిన ఢిల్లీ రమ్మని సిద్ధరామయ్యకు పిలుపు రావడంతో ఆయన హస్తిన చేరుకున్నారు. పలువురు సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
ఐదేళ్ల పదవీ కాలంలో తనకు మొదటి రెండేళ్ల పాటు సీఎంగా ఉండే అవకాశం కల్పించమని సిద్ధరామయ్య కోరినట్లు తెలుస్తోంది. డీకే మాత్రం తనకే పూర్తికాలం పాటు సీఎం పదవిఇవ్వాలని పట్టుబడుతుననట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఇవ్వకపోతే కనీసం క్యాబినెట్లో ఏ స్థానం కూడా వద్దని డీకే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అనుభవమే సిద్ధరామయ్యకు ప్లస్
మరోవైపు సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టడమే సరైనదని కొందరు కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. పాలనానుభవం కలిగిన సిద్ధరామయ్యను సీఎం పదవిలో రెండేళ్ల పాటుకొనసాగించి ఆ తర్వాత నెమ్మదిగా అధికార బదిలీ చేస్తే బాగుంటుందని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు.
పాత కేసులే డీకేకు మైనస్
కొత్తగా సీబీఐ డైరెక్టర్ అయిన సూద్ రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. డీకే శివకుమార్‌పై ఉన్న పాత కేసులను తిరగదోడి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌నేతలు భావిస్తున్నారు. ఒకవేళ డీకే శివకుమార్‌కు సీఎం పదవి అప్పగిస్తే, ప్రవీణ్ సూద్ వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయని, అప్పుడు పాలన కుంటుపడుతుందని సీనియర్ నేతలు కొందరు భావిస్తున్నారు.
డీకే శివకుమార్ మీద పలు కేసులు ఉండడం ప్రస్తుతానికి మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. పలు జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కథనాలు రాశాయి. సీబీఐ నుంచి శివకుమార్‌కు ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉండడంతో సిద్ధరామయ్యకే సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి పరిశీలకులు భావిస్తున్నారు.