2000 Currency Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. జనాలు ఆయోమయానికి గురయ్యారు. నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు (Banks) పోటెత్తారు.
2000 Currency Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. జనాలు ఆయోమయానికి గురయ్యారు. నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు (Banks) పోటెత్తారు. ఎక్కడ చూసినా కూడా నో క్యాష్ బోర్డులే (No cash) దర్శనమిచ్చాయి. అయితే రూ. 2వేల నోట్లను రద్దు చేసినప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున జనాలు వస్తారని అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ ఎక్కడా కూడా కనిపించడం లేదు.
అయితే జనాల దగ్గర రూ. 2000 వేలు నోట్లు లేకపోవడం వల్లే బ్యాంకులకు రావడం లేదని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రవి కుమార్ వెల్లడించారు. రూ. 2 వేల నోట్లన్నీ బడాబాబులు, పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకుల వద్దే ఉన్నాయని ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్లు వారివద్ద ఉన్న నోట్లను మార్చుకుంటున్నారని చెప్పారు. అందుకే బ్యాంకుల్లో ఎక్కడా కూడా జనాలు కనిపించడం లేదని తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల్లో ఇబ్బంది నెలకొందని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగిన ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రీ కాల్ అవుతున్న నోట్ల లెక్క తేల్చేందుకు బ్యాంక్‌లకు ప్రత్యేక ఫార్మాట్ ఇచ్చిందని రవి కుమార్ వివరించారు.
ఇకపోతే ఈనెల 19న రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిన లక్ష్యం నెరవేరిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అందుకే ఉపసంహరించుకున్నామని తెలిపారు. అయితే జనాలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. చట్టబద్ధంగా సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆలోగా రూ. 2వేల నోట్లు ఉన్నవాళ్లు బ్యాంకుకు లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి మార్చుకోవచ్చని సూచించారు.