సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఇన్నిరోజులు బ్యాంకులు.. వ్యాపార సంస్థలను కొళ్లగొట్టిన కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకే (Supreme Court) ఎసరు పెట్టారు. సుప్రీంకోర్టు పేరిట ఫేక్ వెబ్సైట్ (Fake Website) క్రియేట్ చేశారు.
Fake Website: సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఇన్నిరోజులు బ్యాంకులు.. వ్యాపార సంస్థలను కొళ్లగొట్టిన కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకే (Supreme Court) ఎసరు పెట్టారు. సుప్రీంకోర్టు పేరిట ఫేక్ వెబ్సైట్ (Fake Website) క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్ ద్వారా రహస్య సమాచారాన్ని, వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఈ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.
నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Justice D Y Chandrachud) కూడా హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ షేర్ చేయొద్దని అన్నారు. ఆ వెబ్‌సైట్‌ను నగదు లావాదేవీలకు ఉపయోగించవద్దని సూచించారు. అటు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్సైట్ రూపొందించారని.. దానితో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారని నోటీసుల్లో రిజిస్ట్రీ పేర్కొంది. ఆ వెబ్సైట్ www.sci.gov.in డొమైన్‌తో రిజిస్టర్ అయి ఉందని తెలిపింది. ఈ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. రహస్య సమాచారాన్ని షేర్ చేయొద్దని సూచించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ.. ఆర్థిక లావాదేవీలు, రహస్య వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని కోరదని స్పష్టం చేసింది. ఈ నకిలీ వెబ్‌సైట్‌పై దర్యాప్తు ప్రారంభించామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.