Exit Polls: గుజరాత్ లో మరోసారి బీజేపీకే పట్టం – హిమాచల్ లో హోరా హోరీ..
Exit polls for Gujarat and Himachal Pradesh: గుజరాత్ – ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. గుజరాత్ లో ఈ రోజు రెండో విడత పోలింగ్ పూర్తయింది. గుజరాత్ – హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. గుజరాత్ తో మరోసారి బీజేపీకే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. హిమాచల్ లో బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నా..కొన్ని సర్వే సంస్థలు బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరా హోరీ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్ లో ఆప్ ను ప్రజలు పట్టించుకోలేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వంద స్థానాలు ఖాయమని దాదాపు అన్ని సర్వే సంస్థలు తేల్చాయి. బీజేపీకి 123-139 స్థానాలు వరకు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం బీజేపీకి 117 -140 సీట్లు, కాంగ్రెస్ కు 34-51, ఆప్ కు 6-13, ఇతరులకు 1-2 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ సర్వేలో బీజేపీకి 128-148, కాంగ్రెస్ కు 30-42, ఆప్ కు 2-10, ఇతరులకు 3 వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వేల బీజేపీకి 117కి పైగా స్థానాలు వస్తాయని అంచనాకు వచ్చింది. TV9 సర్వేలో బీజేపీకి 125-130 సీట్లు వస్తాయని తేల్చారు. జన్ కీ బాత్ సర్వేలో బీజేపీ 117-140 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. గుజరాత్ లో ఆప్ గట్టి పోటీ ఇస్తుందని పలు విశ్లేషణలు వచ్చాయి. అయితే ,అవన్నీ నిజం కాలేదు. బీజేపీ ఏకపక్షంగా మరోసారి గుజరాత్ పీఠం దక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. అక్కడ చాలా సర్వే సంస్థలు బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరా హోరీ తప్పదని అంచనాలు వెల్లడించాయి. అక్కడ బీజేపీకి 29-39 సీట్లు, కాంగ్రెస్ కు 28-33 సీట్లు వస్తాయని పలు సంస్థలు అంచనాకు వచ్చాయి. రిపబ్లిక్ సీఎన్ఎన్ బీజేపీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ సాధిస్తుందని అంచనా వేసింది. టౌమ్స్ నై సర్వేలో బీజేపీకి 38, కాంగ్రెస్ కు 28 వరకు సీట్లు వస్తాయని తేల్చింది. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 35-40, కాంగ్రెస్ కు 20-25 వరకు వస్తాయని లెక్కలు వేసింది. ప్రముఖ సంస్థలు బీజేపీకి అనుకూలంగా ఉన్నా..మెజార్టీ సంస్థలు మాత్రం హోరా హోరీ ఉంటుందని అంచనాలు వ్యక్తం చేసాయి. ఇక, ఈ నెల గుజరాత్ – హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.