Exit Poll Result: ఈశాన్యంలో బీజేపీ హవా..ఎక్కడ ఎన్ని సీట్లు..
Exit Poll Results on Eastern State Elections: ఈశాన్యరాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే త్రిపుర రాష్ట్రానికి ఇప్పటికే ఇన్నికలు పూర్తవ్వగా, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీన వెలువడనున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశారు. త్రిపురలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. నాగాలాండ్‌లోనూ మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమెక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ముందస్తు సర్వేలు పేర్కొన్నాయి.
అయితే, మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కోనార్డ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి 20 సీట్ల వరకు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీకి 20 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ భారీగా లాభపడే అవకాశం ఉన్నట్లు ముందస్తు సర్వేలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో మేఘాలయలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి 6 సీట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు 6, తృణమూల్‌కు 11 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేఘాలయలో ఎన్‌పీపీకి బీజేపీకి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని, ఫలితంగా బీజేపీ కూటమి అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఎగ్జిట్ పొల్స్ అంచనాలు వేస్తున్నాయి. అత్యంత కీలకమైన త్రిపురలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.