Exit Poll Results 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో పరిస్థితి ఏంటి?
Exit Poll Results 2023: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఫిబ్రవరి 16న త్రిపురలో పోలింగ్ జరిగింది. ఇక ఫిబ్రవరి 27న అంటే ఈరోజే మిగిలిన రెండు రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్ జరిగింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఓటింగ్ పూర్తవడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి.ఇక ఈ పోల్స్ మీద ఒక లుక్కేస్తే యాక్సిస్ మై ఇండియా అనే ఆజ్ తక్‌లో చూపిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, త్రిపురలో బీజేపీకి 36 నుంచి 45 సీట్లు వస్తాయట. ఇక్కడ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. అదే సమయంలో వామపక్షాలు, కాంగ్రెస్ కూటమికి 6 నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా. మరోవైపు తిప్ర మోత పార్టీకి 9 నుంచి 16 సీట్లు వస్తాయని, మాణిక్ సాహాపై ప్రజలు గరిష్ట విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన సీఎం పీఠాన్ని కాపాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు, జీనియూస్‌లో చూపిస్తున్న జీ మ్యాట్రిస్ ప్రకారం, నాగాలాండ్‌లో కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందట, ఇక్కడ బీజేపీ 35 నుంచి 43 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ కేవలం 1 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా. ఇక ఇవి కాకుండా మిగిలిన రెండు పార్టీలలో, ఎన్పీపీ ఒక సీటుకు సున్నా, ఎన్పీఎఫ్ కు 2 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా. ఇక్కడ ఎన్‌డిపిపి, బిజెపిలకు 67% ఓట్లు వచ్చే అవకాశం ఉందని, జీ మ్యాట్రిస్ సర్వే ప్రకారం మేఘాలయలో బీజేపీ వెనుకబడి ఉందని తేలింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఎన్‌పిపికి 21 నుంచి 26 సీట్లు వస్తాయని అంచనా వేయగా, బిజెపికి 6 నుంచి 11 సీట్లు మాత్రమే వస్తాయని, మరోవైపు, టీఎంసీ ఇక్కడ రెండు అంకెల సంఖ్యకు చేరుకునే అవకాశం ఉంది. టీఎంసీకి 8 నుంచి 13 సీట్లు వస్తాయని అంచనా ఉండగా మేఘాలయలో మాత్రం కాంగ్రెస్ చివరి స్థానంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయట.