కర్ణాటక (Karnataka) మాజీ సీఎం, జేడీఎస్ సీనియర్ నేత కుమారస్వామి (Kumaraswamy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని అపోలో ఆసుపత్రికి (Apollo Hospital) తరలించారు.
Kumaraswamy: కర్ణాటక (Karnataka) మాజీ సీఎం, జేడీఎస్ సీనియర్ నేత కుమారస్వామి (Kumaraswamy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని అపోలో ఆసుపత్రికి (Apollo Hospital) తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం ఐసీయూలో కుమారస్వామికి చికిత్స అందిస్తోంది.
ఈ మేరకు అపోలో ఆసుపత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బుధవారం తెల్లవారు జామున 3.40 గంటల సమయంలో తీవ్రజ్వరంతో ఆసుపత్రికి వచ్చినట్లు బులిటెన్లో వైద్యులు పేర్కొన్నారు. వెంటనే ఆయన్ను పరీక్షించి చికిత్స మొదలు పెట్టామని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని తెలిపారు. త్వరలోనే ఆయన్ను దిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
మరోవైపు కుమారస్వామి ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి అయన్ను పరామర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అపోలో ఆసుపత్రికి ఫోన్ చేసి కుమారస్వామి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మరోవైపు కుమారస్వామి కొద్దిరోజులుగా తీరిక లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తీరికలేని పని వల్లే ఆయన అనారోగ్యానికి గురి అయినట్లు తెలుస్తోంది.
Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz
— ANI (@ANI) August 30, 2023