Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం 292 కోట్లు.. ఈడీ బయటపెట్టిన విషేశాలివే!
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం 292 కోట్లు అని తేల్చింది ఈడి. ఈ కేసు గురించి ఈడీ క్లారిటీ ఇస్తూ ఈ కేసుకు సంబంధించి మరో ఏడుగురికి నోటీసులు ఇచ్చామని, మనీష్ ను పది రోజుల కస్టడీ టైం లోనే వారిని కూడా విచారిస్తామని పేర్కొంది. ఇక మనీష్ ను 10 రోజుల రిమాండ్ కోరుతున్నామని, సౌత్ గ్రూప్ సభ్యులు 9 జోన్‌లపై నియంత్రణ సాధించారని పేర్కొంది. అందువల్ల ఢిల్లీలో ఎక్సైజ్ వ్యాపారంలో తీవ్రమైన కార్టెల్ చేస్తున్నారని, కె కవితతో విజయ్ నాయర్ సమావేశం అయ్యారని పేర్కొంది. విజయ్ నాయర్ ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం తరఫున యాక్ట్ చేశారని పేర్కొంది. ఇక సిసోడియా వ్యక్తిగతంగా ఇండో స్పిరిట్స్ ఫైల్‌ను క్లియర్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని, విజయ్ నాయర్ అరెస్టు చేసిన వ్యక్తికి మద్దతుగా పనిచేశాడని కూడా వెల్లడించింది. ఇక సాక్ష్యాలు మరియు ఫోన్‌లను నాశనం చేయడంపై ఆరోపణలు ఉన్నాయని, మనీష్ ఇతరుల పేరుతో కొనుగోలు చేసిన సిమ్ కార్డులు మరియు ఫోన్‌లను ఉపయోగించారని పేర్కొంది. సంజయ్ పేరుతో కొనుగోలు చేసిన ఫోన్‌ను అతనే ఉపయోగించాడని పేర్కొన్న ఈడీ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ లు కొనుగోలు చేశారని వాటిలో రెండు ఫోన్ రికవరీ అయ్యాయి, ఇంకా 22 ఫోన్ రికవరీ కావాలని పేర్కొంది.