EC: రిమోట్ ఓటింగ్ విధానంపై రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం
Election Commission meet with Political Parties on Remote Voting
కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ మిషన్ విషయమై నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. మొత్తం 65 రాజకీయ పార్టీలను ఆహ్వానం పలికింది. గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర స్థాయి పార్టీలకు ఈసీ ఆహ్వానం పలికింది. రిమోట్ ఓటింగ్ మెషీన్ గురించి సాంకేతిక నిపుణులు పార్టీ ప్రతినిధులకు వివరించనున్నారు.
పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలసల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న పలు వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఈసీ రిమోట్ ఓటింగ్ విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. అలాంటివారు ఓటింగ్ లో పాల్గొనేలా సదుపాయం కల్పించేందుకు ఈసీ నిర్ణయించింది. రిమోట్ ఓటింగ్ మెషిన్ ఏర్పాటు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం కానున్న నేపథ్యంలో విపక్షాలు సమావేశం అయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రిమోట్ ఓటింగ్ మెషీన్” విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాయి. నేడు సమావేశంలో అదే నిర్ణయాన్ని విపక్ష కూటమి వెల్లడించనుంది. మరోవైపు రిమోట్ ఓటింగ్ మిషన్ విధానంపై తమ తమ అభిప్రాయాలను జనవరి 31లోగా రాతపూర్వకంగా వెల్లడించాలని ఈసీ పార్టీలను కోరింది.