Bihar: వృద్ధుడిపై మహిళా కానిస్టేబుళ్ల దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
Bihar: ఆయనో 70 ఏళ్ళ వృద్ధుడైన కూడా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ తనకుతాను బ్రతుకు తున్నాడు. అలాంటి ఓ పెద్దాయనాని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా నడిరోడ్డుపై కొట్టారు. మహిళా కానిస్టేబుళ్ల దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పెద్దాయన అనే జాలి కూడా లేకుండా నడి రోడ్డుపై అలా కొట్టడం ఏంటి అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు..సదరు మహిళా కానిస్టేబుళ్లఫై చర్యలు తీసుకోవాలనినెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బీహార్ లోని కైమూర్ ప్రాంతంలో రోడ్డుపై సైకిల్ మీద వెళ్తూ 70 ఏళ్ల ఆ టీచర్ కిందపడిపోయాడు. లేచి నిలబడడానికి కాస్త సమయం పట్టింది. అంతే ఆ సయమంలో ట్రాఫిక్ జాం అయింది. నీ వల్లే ట్రాఫిక్ జాం అయ్యిందని సదరు వృద్ధుడిపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. దెబ్బలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా విడవకుండా విచక్షణారహితంగా కొట్టారు. కొట్టవద్దు అని ఎంత ప్రాధేయపడినా ఆ కానిస్టేబుళ్లు మాత్రం ఆయన్ని కొడుతూనే ఉన్నారు. ఈ దారుణాన్ని ఆపేందుకు చుట్టూ ఉన్నవారు కూడా ప్రయత్నించలేదు. ఓ సదరు వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ట్వీట్ చేశారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వృద్ధుడు అని చూడకుండా ఇంతలా కొట్టడమేంటని కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఈ వీడియోపై స్పందించారు. వీడియోను రీట్వీట్ చేస్తూ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని తేజస్వీ యాదవ్ ను కోరారు. వీడియో వేగంగా వైరల్ కావడంతో ఎస్పీ విషయం గ్రహించి ఇద్దరు కానిస్టేబుళ్లను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు.
Paap ka ghada bhar raha haihttps://t.co/rh1BlLEjvK
— Paramanand ࿗ 🇮🇳 (@paramanand_3) January 21, 2023