West Bengal: పశ్చిమ బెంగాల్ లో ఈడీ దాడులు..మంత్రి సన్నిహితురాలి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు
West Bengal SSC scam: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తృణమూల్ కాంగ్రెస్ నేతల అనుచరుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ అనుచరురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో 20 కోట్ల రూపాయల నగదను స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ సర్వీస్ కమిషన్‌లో రిక్రూట్మెంట్లలో భారీగా అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎస్ఎస్సీ స్కామ్‌కు సంబంధించినదిగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అర్పిత ముఖర్జీ ఇంట్లో లభ్యమైన 20 కోట్లను ఈడీ సీజ్ చేసింది. 20 సెల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
మరో వైపు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటామన్న మమతాకు చురకలంటించారు. ఇది కోపం, అహం చూపించే సమయం కాదంటూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ధైర్యం, నాయకత్వం, ఐక్యత కోసం పోరాడాల్సిన సమయం ఇదేనన్నారు. ఇకనైనా మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.