MLC Kavitha: కవిత వాడుతున్న ఫోన్ అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత వాంగ్మూలం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం” లోని సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలాన్ని ఈడి అధికారులు నమోదు చేసుకుంటున్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదేశించారని అంటున్నారు. దీంతో విచారణ గది నుంచి బయటకు వచ్చిన కవిత.. తన పర్సనల్ సెక్యూరిటీ దగ్గరున్న ఫోన్‌ను ఈడీ అధికారులకు అదించారని తెలుస్తోంది. అంతకు ముందే ఇంటి వద్ద ఉన్న ఎమ్మెల్సీ ఫోన్‌ను సెక్యూరిటీతో ఈడీ అధికారులు తెప్పించారని, ఈ క్రమంలో కవిత ఫోన్‌లో ఉన్న డేటాను ఈడీ అధికారులు పరిశీలించనున్నారని అంటున్నారు.. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.