MLC Kavitha: కవితకు మళ్లీ పిలుపు, ఈ నెల 20న హాజరు కావాలని ఈడీ ఆదేశం
ED issue Fresh Notice to MLC Kavitha, asks her to apper on March 20
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ రోజు విచారణకు గైర్హాజరు కవితను మార్చి 20న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ విచారణకు కవిత ఈ రోజు హజరు కాలేదు. కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీ అధికారులకు కొన్ని డాక్యుమెంట్లు పంపారు.
అరుణ్ పిళ్ళై ఈడి కస్టడీ నేటితో ముగిసింది. ఈ నెల 6న పిళ్ళైని అరెస్ట్ చేసిన ఈడి పది రోజుల పాటూ విచారించింది.ఈ రోజు రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపర్చింది.EDకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు స్పెషల్ కోర్టులో రామచంద్రపిళ్లై పిటీషన్ వేశారు. పిళ్ళై పిటిషన్ పై స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై కస్టడీ పొడగించాలని ఈడి కోరింది. కవితతో కలిపి విచారించాలని ఈడీ భావిస్తోంది.
స్పెషల్ కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
అందరినీ కలిపి విచారిస్తే ఎలా అంటూ స్పెషల్ కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా కూడా విచారణ ఉంటుంది కదా అని ప్రశ్నించింది. పిళ్లై కస్టడీని 5 రోజుల పాటు పొడిగించాలని కోరగా…ఈడీ మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే కస్టడీ పొడిగించింది.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి ఈడి నోటీసులు
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ నోటీసులు అందుకున్నారు. వైసీపీ ఎంపీని మార్చి 18న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. రాఘవ రెడ్డి ప్రస్తుతం తీహార్ జైల్ లో ఉన్నారు.