Elections 2023: నేడే నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఎన్నికల షెడ్యూల్
Elections 2023: 2023 లో తొలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. గడువు ముగుస్తున్నమూడురాష్ట్రల్లో ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. నాగాలాండ్ , మేఘాలయ , త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ రెడీ చేసింది ఈసీ. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మూడు రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనుంది.
త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా, మేఘాలయ, నాగాలాండ్ ల్లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. మార్చి లో ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మార్చి 12,మార్చి15,మార్చి 22వతేదీల్లో ఈ మూడురాష్ట్రల ఐదు సంవత్సరాల పదవీకాలం ముగుస్తుంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటించారు. అక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఇప్పటికే కొద్ది నెలలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టాయి.