DK Shivakumar: సీఎం కుర్చీకి సంబంధించి కర్ణాటకలో (Karnataka) నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar), సీనియర్ నేత సిద్ధరామయ్య (siddaramaiah).. ఇద్దరిలో ఎవరిని కుర్చీలో కూర్చోబెట్టాలనేది కాంగ్రెస్ హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారింది. ఈక్రమంలో డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
DK Shivakumar: సీఎం కుర్చీకి సంబంధించి కర్ణాటకలో (Karnataka) నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar), సీనియర్ నేత సిద్ధరామయ్య (siddaramaiah).. ఇద్దరిలో ఎవరిని కుర్చీలో కూర్చోబెట్టాలనేది కాంగ్రెస్ హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారింది. ఈక్రమంలో డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. చెడ్డపేరుతో వెళ్లాలనుకోవట్లేదని అన్నారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతాయుతంగా ఉంటానని శివకుమార్ అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
వెన్నుపోటు పొడవనని.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తనకు తెలవవని డీకే శివకుమార్ గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు డీకే. అలాగే తాము 135 సీట్లు గెలిచామని.. ఎవరికీన విడగొట్టాలని అనుకోవడం లేదని శివకుమార్ చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తీసుకురావడమే తమ ముందున్న సవాల్ అని వెల్లడించారు.
ఇకపోతే అధిష్టానం పిలుపు మేరకు శివకుమార్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఇప్పటికే కర్ణాటకలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు అగ్రనేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు. అంతకముందు డీకే, సిద్ధరామయ్య చెరో రెండేళ్లు పదవి చేపట్టాలని హైకమాండ్ ప్రతిపాదించినట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా డీకే స్పందించారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని స్పష్టం చేశారు.
ఇక ఇవాళ ఉదయం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు. సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై చర్చించారు. అలాగే ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్‌తో కూడా సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.