Tamil Nadu : సోదరుడి సపోర్ట్… దూకుడు పెంచిన శశికళ
Divakaran Joins Aiadmk Party Presence Of Sasikala : దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మాజీ సహాయకురాలు వీకే శశికళ దూకుడు పెంచింది. శశికళకు మద్దతుగా ఆమె సోదరుడు వీ దివాకరన్ మంగళవారం 2018లో తాను స్థాపించిన అన్నా ద్రవిడర్ కజగంను ఆమె వర్గంలో విలీనం చేశారు. నిజానికి ఇప్పటివరకూ ఏఐఏడీఎంకేలో నాయకత్వ సమస్య కారణంగా ఓపీఎస్, ఈపీఎస్ టీమ్లు వేర్వేరుగా పని చేస్తున్నాయి. శశికళ సోదరుడు దివాకరన్, ఆమె అక్క కుమారుడు టిటివి దినకరన్ మధ్య చోటు చేసుకున్నవిబేధాలు తారాస్థాయికి చేరడంతో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అన్నా ద్రవిడ కళగం అనే పార్టీని రంగంలోకి దించారు. ఇక ఈ రెండు పార్టీలకూ పెద్దగా బలం, బలగం రెండూ లేవనే చెప్పాలి. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని నేనేనని, త్వరలో నాయకత్వ బాధ్యతలు చేపడతానని శశికళ తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆమె రాజకీయంగా దూకుడు పెంచినట్టే కన్పిస్తోంది.