DGCA Fine: మూత్ర విసర్జన ఘటన.. ఎయిర్ ఇండియాపై DGCA కఠిన చర్యలు
DGCA imposes 30 lakh Fine: 2022 నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన ఘటనపై DGCA కఠిన చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు మూడు నెలల పాటు పైలట్ లైసెన్స్‌ను కూడా డీజీసీఏ సస్పెండ్ చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 141 మరియు వర్తించే DGCA పౌర విమానయాన అవసరాల ప్రకారం DGCA తన విధులను పాటించని దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు రూ.3 లక్షల జరిమానా కూడా విధించారు. నవంబర్ 26న ఎయిరిండియా న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఓ మహిళా ప్రయాణికుడిపై మిశ్రా మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జనవరి 4న ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అయితే, గత వారం మిశ్రా ఆశ్చర్యకరంగా తన ఆరోపణలపై వెనక్కి తగ్గారు. తాను నేరం చేయలేదని, బాధితురాలు తనపై మూత్ర విసర్జన చేసిందని మిశ్రా ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన లాయర్ తొలిసారిగా ఈ వాదనలు వినిపించారు. నిందితుడైన శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు చాలా రోజులుగా పరారీలో ఉండగా జనవరి 7న బెంగళూరులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో మహిళతో శంకర్ మిశ్రా దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై పలువురు జాతీయ నేతలు సైతం అప్పట్లో స్పందించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మిశ్రాపై ఎయిర్ ఇండియా కూడా 4 నెలల పాటు నిషేధం విధించింది. ఈ క్రమంలో శంకర్ మిశ్రా 4 నెలల పాటు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించలేరు.