YS Sharmila: షర్మిల పార్లమెంట్ ఛలో కార్యక్రమానికి బ్రేక్, ఢిల్లీ పోలీసుల అరెస్టు
Delhin Police arrest YS Sharmila
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న షర్మిల ప్రస్తుతం ఢిల్లీలో దీక్షకు దిగారు. జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. అక్కడి నుంచి ఛలో పార్లమెంట్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ వైపు తన పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. షర్మిలతో పాటు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలో దీక్షకు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు షర్మిల ట్విట్టర్ ద్వారా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ప్రస్తావించారు. ఢిల్లీలో చేపట్టనున్న దీక్ష గురించి వెల్లడించారు. సీబీఐకి, కాగ్ సంస్థలకు ఇప్పటికే ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కామ్. పారే ఎకరాల్లో, చేసిన ఖర్చుల్లో అన్నీ దొంగ లెక్కలే. ఆనాడు వైయస్ఆర్ గారు 16.46లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని రూ.38వేల కోట్లతో అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును, కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో రూ.1.20లక్షల కోట్లకు పెంచి, దాదాపు రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
కేసీఆర్ అవినీతి దేశ ప్రజలకు, పార్లమెంట్ సభ్యులకు తెలియజేసేందుకే ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించబోతున్నాం. కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేశాం. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు YSR తెలంగాణ పార్టీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలుపుతుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రం చెప్పడం కాదు, విచారణ జరిపించాలి.
కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కామ్. పారే ఎకరాల్లో, చేసిన ఖర్చుల్లో అన్నీ దొంగ లెక్కలే. ఆనాడు వైయస్ఆర్ గారు 16.46లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని రూ.38వేల కోట్లతో అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి
1/3 pic.twitter.com/uEVo9MGxBg— YS Sharmila (@realyssharmila) March 13, 2023
కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేశాం. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు YSR తెలంగాణ పార్టీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలుపుతుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రం చెప్పడం కాదు, విచారణ జరిపించాలి.
3/3— YS Sharmila (@realyssharmila) March 13, 2023