Delhi Ministers Resgignation: ఢిల్లీ మంత్రులు సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా!
Delhi Ministers Resgignation: మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమోదించారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ (2021-22) కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు అతనికి ఐదు రోజుల (మార్చి 4 వరకు) సిబిఐ రిమాండ్ విధించింది. అయితే సత్యేందర్ జైన్‌ను గత ఏడాది మే 30న అరెస్టు చేసి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంచారు. ఎక్సైజ్ పాలసీ కేసులో చిక్కుల్లో పడిన మనీష్ సిసోడియా తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిసోడియా పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌తో సహా వివిధ చట్టపరమైన పరిష్కారాలు మీకు అందుబాటులో ఉన్నాయని పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక ఈ మంత్రులు రాజీనామా చేయాలంటూ బీజేపీ నిత్యం డిమాండ్ వచేస్తూ వచ్చింది. ఇక ఈ నిర్ణయం పట్ల ఢిల్లీలోని లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రులు బాధపడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఇక సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతూ – మేము కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాము, ఇప్పుడు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నామని పేర్కొంది.