Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వారికి బెయిల్!
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఢిల్లీలో కాదు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఢిల్లీ ప్రభుత్వంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది, రూస్ అవెన్యూ కోర్టు 5 రోజుల రిమాండ్‌కు పంపింది. ఈ అరెస్ట్ తర్వాత, ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టగా అక్కడ నిరాశ పాలయ్యాడు. అదే సమయంలో ఈ విషయంలో మరో మారు వార్తలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముఠా గౌతమ్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణంలో గతంలో సీబీఐ అరెస్ట్ చేసిన ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కూడా సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహలతో కూడిన ధర్మాసనం.. మీరు నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు? బెయిల్ కోసం మీకు ఇతర న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి, అయితే మీరు నేరుగా ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించారు.