BBC: అంతర్జాతీయ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) 2002 గుజరాత్ అల్లర్లపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
BBC: అంతర్జాతీయ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) 2002 గుజరాత్ అల్లర్లపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఇండియా ది మోడీ క్వశ్చన్ (India The Modi Question) పేరుతో రూపొందించిన ఆ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. విధ్వంసం, అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించిన కేంద్రం.. ఆ డాక్యుమెంటరీపై భారత్‌లో నిషేధం విధించింది. అటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆ డాక్యుమెంటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఆ డాక్యుమెంటరీపై గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే ఎన్జీవో ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించింది. బీబీసీపై పిటిషన్ దాఖలు చేసింది. ఆ డాక్యుమెంటరీ దేశానికి , ప్రధానమంత్రికి పరువునష్టం కలిగించేలా.. భాతర న్యాయవ్యవస్థను అనుమానించేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బీబీసీకి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.